ఆ బ్యూటిఫుల్ ఎంపీ లవ్‌స్టోరీ విన్నారా బాసూ..!

మోడలింగ్‌లో రాణించిన తర్వాత.. బెంగాలీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నుస్రత్ జహాన్.. ఈమె తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఈమె ఘన విజయం సాధించింది. రాజకీయ అరంగ్రేటంతోనే అదరగొట్టిన ఈ భామ ప్రేమ విషయం గురించి గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఆమె ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో […]

ఆ బ్యూటిఫుల్ ఎంపీ లవ్‌స్టోరీ విన్నారా బాసూ..!

Updated on: Jun 02, 2019 | 3:32 PM

మోడలింగ్‌లో రాణించిన తర్వాత.. బెంగాలీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నుస్రత్ జహాన్.. ఈమె తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఈమె ఘన విజయం సాధించింది. రాజకీయ అరంగ్రేటంతోనే అదరగొట్టిన ఈ భామ ప్రేమ విషయం గురించి గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఇటీవల ఆమె ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్ట్‌లో నుస్రత్ తన ప్రియుడు చేతికి పెట్టిన రింగ్‌తో కనిపిస్తుంది. దాని కింద ‘ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి జీవితంను పంచుకోవాలనుకున్నప్పుడు నిజమైన ప్రేమ తెలుస్తుంది. వారితో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కలలో కంటే నిజంగానే బాగుందనిపిస్తుందని అంటూ రాసింది.

మోస్ట్ బ్యూటిఫుల్ ఎంపీగా పిలిపించుకుంటున్న ఈమె అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. దీంతో ఆమె గురించి వస్తున్న రూమర్స్‌కు ఒక్కసారిగా చెక్ పడినట్లయింది.