Bowenpally Kidnap Case: ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. కేసు రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలను టీవీ9 సంపాదించింది. భూమా అఖిలప్రియను రిపోర్టులో ఏ1గా పేర్కొన్నారు బోయిన్‌పల్లి పోలీసులు. ఏ2గా ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్‌రామ్‌ను పేర్లు నమోదు చేశారు. శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్‌ను నిందితులుగా చేర్చారు. వీరిపై ఐపీసీ 147, 120బి, 452, 419, 341, 342, 506, 365, 324, 385 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కళ్లకు గంతలు కట్టి తమను తీసుకెళ్లినట్లు పోలీసులకు బాధితులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వే నంబర్. 80లో 2016లో బాధితులు 25 ఎకరాల భూములు కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ భూములు తమవేనని భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, సుబ్బా రెడ్డి వాదిస్తున్నారు. సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావు డబ్బులిచ్చి మేటర్ సెటిల్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే భూమి ధర పెరగడంతో..నిందితులు సమస్యలు సృష్టించారని..ఇంకా డబ్బు కావాలంటూ డిమాండ్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Also Read :
Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్