ఆకాశంలో ‘మెరుపు’.. ఇదో సరికొత్త రికార్డు

|

Jun 27, 2020 | 9:37 AM

ఆకాశంలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ఓ మెరుపు ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఈ మెరుపుల‌కు క్రియేట్ చేసిన కొత్త రికార్డుల‌ను ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ రిలీజ్ చేసింది....

ఆకాశంలో మెరుపు.. ఇదో సరికొత్త రికార్డు
Follow us on

ఆకాశంలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ఓ మెరుపు ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఈ  కొత్త రికార్డు‌ను ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ రిలీజ్ చేసింది. అత్యంత పొడువైన మెరుపుగా గుర్తించింది. బ్రెజిల్‌లో సంభ‌వించిన‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మెరుపు నుంచి వెలుబ‌డిన మెగాఫ్లాష్‌.. సుమారు 700 కి.మీ దూరం ఉన్న‌ట్లుగా అంచ‌నా వేసింది.

2018, అక్టోబ‌ర్ 31న ద‌క్షిణ బ్రెజిల్‌లో ఈ మెరుపు క‌నిపించిందని ప్రకటించింది. వాషింగ్ట‌న్ డీసీ నుంచి బోస్ట‌న్‌కు ఎంత దూరం ఉంటుందో.. ఆ మెరుపు పొడుగు అంత ఉంటుంద‌ని ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ వెల్ల‌డించింది. ఇది అత్యంత పొడువైన మెరుపు మాత్ర‌మే కాదని.. ఇది ఎక్కువ సమయం పాటు క‌నిపించిన మెరుపుగా గుర్తించారు.

ఇక అర్జెంటినాలో గ‌త ఏడాది మార్చి 4న ఓ మెరుపు దాదాపు 16.73 సెక‌న్ల పాటు క‌నిపించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ మెరుపులు అసాధార‌ణ రికార్డుల‌ను నెల‌కొల్పిన‌ట్లు ఆరిజోనా వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రాండాల్ సెర్వ‌నీ చెప్పారు.

ఇవి మాత్రమే కాదు మీ ప్రాంతంలో ఇలాంటి మెరుపు సంభవిస్తే… వాటిని కూడా మన వాతావరణ శాఖ అధికారులు గుర్తిస్తారు. ఇలాంటివి  వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా జరుగుతాయని హెచ్చరించారు.