ఉపరాష్ట్రపతి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు: వెంకయ్య నాయుడు

| Edited By: Pardhasaradhi Peri

Aug 12, 2019 | 6:37 AM

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆవిష్కరించారు. చెన్నైలోని ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉన్నానని.. ప్రజాసేవకు కాదన్నారు. ఏ హోదాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగానే ఉంటానన్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకోవడంలో భాగంగా.. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించానని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 600 జిల్లాల్లో తిరిగానన్నారు. ఎక్కడికి వెళ్లినా కొత్త విషయం నేర్చుకోవడానికి […]

ఉపరాష్ట్రపతి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు: వెంకయ్య నాయుడు
Follow us on

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆవిష్కరించారు. చెన్నైలోని ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉన్నానని.. ప్రజాసేవకు కాదన్నారు. ఏ హోదాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగానే ఉంటానన్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకోవడంలో భాగంగా.. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించానని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 600 జిల్లాల్లో తిరిగానన్నారు. ఎక్కడికి వెళ్లినా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటానన్నారు. ఎంత ఎదిగినా.. నేర్చుకోవడం ఆపొద్దని సూచించారు.

వెంకయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఎప్పుడూ ఉప రాష్ట్రపతి కావాలనుకోలేదని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయాల నుంచి విరమించుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నానాజీ దేశ్‌ముఖ్‌ లాంటి మహానాయకుల తరహాలో దేశాన్ని పటిష్ఠం చేసే నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నానన్నారు.