ట్రంప్‌కు షాకు మీద షాకు: ప్రసంగం లైవ్ కట్, జార్జియాలోనూ ఎదురుదెబ్బ.!

|

Nov 06, 2020 | 12:02 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత డొనాల్డ్ ట్రంప్ కు షాకులుమీద షాకులు తగులుతున్నాయి. సాక్షాత్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు ఎన్నికల అనంతరం తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతుండగా, పలు టీవీ చానెళ్లు, ఆ ప్రసారాన్ని మధ్యలోనే నిలిపివేశాయి. ఈ కార్యక్రమం 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం ఎంఎస్ఎన్బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ కల్పించుకుని, ఓకే… మనం ఇప్పుడు అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నామంటూ ముగిస్తే, ఎన్బీసీ, ఏబీసీ […]

ట్రంప్‌కు షాకు మీద షాకు: ప్రసంగం లైవ్ కట్, జార్జియాలోనూ ఎదురుదెబ్బ.!
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత డొనాల్డ్ ట్రంప్ కు షాకులుమీద షాకులు తగులుతున్నాయి. సాక్షాత్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు ఎన్నికల అనంతరం తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతుండగా, పలు టీవీ చానెళ్లు, ఆ ప్రసారాన్ని మధ్యలోనే నిలిపివేశాయి. ఈ కార్యక్రమం 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం ఎంఎస్ఎన్బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ కల్పించుకుని, ఓకే… మనం ఇప్పుడు అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నామంటూ ముగిస్తే, ఎన్బీసీ, ఏబీసీ న్యూస్ వంటి టీవీ చానెళ్లు సైతం ట్రంప్ లైవ్ కవరేజ్ ని నిలిపివేశాయి. మరో అడుగుముందుకేసిన సీఎన్ఎన్ యాంకర్ జేక్ టాపర్.. ఇది ఎంత దురదృష్టకరమైన రాత్రి? అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రజలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు.. దీనికి ఒక్క సాక్ష్యం కూడా లేదంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాల్లో భాగంగా జార్జియా కౌంటింగ్ చివరి దశకు వచ్చింది. అక్కడ కూడా ట్రంప్ మెజార్టీ తగ్గుతోంది. నెవాడా, జార్జియా లలో ఏది ఓడిపోయినా ఇక ట్రంప్ ఇంటికే.