నేపాల్ ప్రధాని రాజీనామాకు పాలక పార్టీ డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2020 | 9:41 AM

నేపాల్ లో ఇండియాకు వ్యతిరేకంగా దేశ భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ రూపొందించిన పొలిటికల్ మ్యాప్ ని పార్లమెంట్ చేత ప్రధాని కె.పి.శర్మ ఓలి ఆమోదింప జేసినప్పటికీ ఈ ప్రయత్నం ఆయనకే బెడిసి కొట్టింది. తనను పదవి నుంచి..

నేపాల్ ప్రధాని రాజీనామాకు పాలక పార్టీ డిమాండ్
Follow us on

నేపాల్ లో ఇండియాకు వ్యతిరేకంగా దేశ భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ రూపొందించిన పొలిటికల్ మ్యాప్ ని పార్లమెంట్ చేత ప్రధాని కె.పి.శర్మ ఓలి ఆమోదింప జేసినప్పటికీ ఈ ప్రయత్నం ఆయనకే బెడిసి కొట్టింది. తనను పదవి నుంచి తొలగించడానికి భారత్ ప్రయత్నిస్తోందంటూ ఆయన చేసిన ఆరోపణలను సొంత పాలక పార్టీయే ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. శర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిన్న శర్మ అధికారిక నివాసంలో  పాలక స్టాండింగ్ కమిటీ సమావేశమైన వెంటనే మాజీ ప్రధాని పుష్పా కమల్ దహాల్ ‘ప్రచండ’.. శర్మను తీవ్రంగా విమర్శించారు. తనను ప్రభుత్వం నుంచి గద్దె దించడానికి ఇండియా కుట్ర పన్నుతోందని ప్రధాని చేసిన ఆరోపణలు రాజకీయంగా సరికావన్నారు. దౌత్యపరంగా ఆమోదయోగ్యం  కావని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రకటనలు పొరుగు దేశంతో నేపాల్ కు గల సంబంధాలను దెబ్బ తీస్తాయన్నారు. కాగా-అధికారం నుంచి తనను తొలగించేందుకు ‘ఎంబసీలు,’ ‘హోటళ్లలో’ వివిధ రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, కొందరు నేపాలీ నాయకులకు కూడా వీటితో సంబంధం ఉందని శర్మ గత ఆదివారం ఆరోపించారు. దీంతో పాలక పార్టీ నేతలు ఆయన రాజీనామా చేయాల్సిందే అని కోరారు. అయితే ఈ డిమాండుపై శర్మ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.గతంలో కూడా ఆయన రాజీనామాకు పాలక పార్టీ డిమాండ్ చేసింది.