భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి

|

Nov 06, 2020 | 4:30 PM

భారత్-నేపాల్ దేశాల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలోనే సమసిపోతాయని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేపాల్‌ పర్యటనలో భాగంగా భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ నరవాణే శుక్రవారం ప్రధాని, రక్షణ మంత్రి కేపీ శర్మ ఓలితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రి అధికారిక భవనంలో జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘకాలంగా భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక […]

భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి
Follow us on

భారత్-నేపాల్ దేశాల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలోనే సమసిపోతాయని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేపాల్‌ పర్యటనలో భాగంగా భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ నరవాణే శుక్రవారం ప్రధాని, రక్షణ మంత్రి కేపీ శర్మ ఓలితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రి అధికారిక భవనంలో జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘకాలంగా భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక బంధం గురించి ఓలీ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు నేపాల్‌ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇలాఉండగా, భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలు తమవేనంటూ కొన్ని నెలల క్రితం నేపాల్‌ మ్యాపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.