భారత సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు సంఘర్షణ ప్రాంతాలు: సంజయ్ రౌత్

| Edited By:

Jun 21, 2020 | 4:45 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే అమెరికా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఓడిపోతారని

భారత సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు సంఘర్షణ ప్రాంతాలు: సంజయ్ రౌత్
Follow us on

Neighbours backing China: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే అమెరికా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఓడిపోతారని, అప్పుడు ప్రధాని మోదీ ఒంటరవుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. అప్పుడు ఇరుగు పొరుగు దేశాలన్నీ చైనాతో జతకడతాయని వ్యాఖ్యానించారు. శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ వేదికగా ఆయన ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. దేశ దౌత్య విధానం విఫలమైనందునే చైనా అంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన ఆరోపించారు.

“భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు సంఘర్షణ ప్రాంతాలు” అని పేర్కొన్నారు. మన ఇరుగు పొరుగు దేశాలన్నీ చైనా వైపే నిలుస్తున్నాయి. మన విదేశాంగ విధానం విఫలం కావడం వల్లే ఈ దుస్థితి. వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓడిపోతాడు. అప్పుడు ప్రధాని మోదీ వైపు ఎవరు నిలుస్తారు? బాహుబలి రాజకీయాలను చైనా తుస్సుమనిపించింది.. అంటూ సంపాదకీయంలో వ్యాఖ్యానించారు.

Also Read: భారత్ లో.. గత 8 రోజుల్లో.. లక్ష మందికి కరోనా..