ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై రోజంతా నెఫ్ట్ లావాదేవీలు..

నెఫ్ట్(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా లావాదేవీలు చేసే కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 16 నుంచి ఖాతాదారులు ఈ సేవలను 24 గంటలూ ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ఈ నేపధ్యంలో కస్టమర్లు నెఫ్ట్ సర్వీసులను సెలవుల్లో కూడా 24*7 వాడుకునే సౌకర్యం ఉందని చెప్పొచ్చు. పేమెంట్స్ సెటిల్‌మెంట్ విజన్ 2019-21 భాగంగా ఆర్బీఐ మొదటిగా నెఫ్ట్, ఆర్టీజిస్ సేవలను ఉచితంగా కస్టమర్లు 24 గంటలూ కొనసాగించుకునేందుకు వీలు కల్పించింది. […]

ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై రోజంతా నెఫ్ట్ లావాదేవీలు..

Updated on: Dec 08, 2019 | 12:23 PM

నెఫ్ట్(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా లావాదేవీలు చేసే కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 16 నుంచి ఖాతాదారులు ఈ సేవలను 24 గంటలూ ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ఈ నేపధ్యంలో కస్టమర్లు నెఫ్ట్ సర్వీసులను సెలవుల్లో కూడా 24*7 వాడుకునే సౌకర్యం ఉందని చెప్పొచ్చు. పేమెంట్స్ సెటిల్‌మెంట్ విజన్ 2019-21 భాగంగా ఆర్బీఐ మొదటిగా నెఫ్ట్, ఆర్టీజిస్ సేవలను ఉచితంగా కస్టమర్లు 24 గంటలూ కొనసాగించుకునేందుకు వీలు కల్పించింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నెఫ్ట్ సేవలు మామూలు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుండగా.. శనివారాల్లో(మొదట, మూడు) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక లావాదేవీలు అన్ని కూడా గంటకోసారి సెటిల్ చేస్తున్నారు. ఇక ఈ నెఫ్ట్ సేవలు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలు, పబ్లిక్ హాలిడేస్‌లో పని చేయవు. కాగా నెఫ్ట్ విధానంలో ఖాతాదారులకు లిమిట్ లేకపోగా.. ఆర్టీజిస్ విధానంలో మాత్రం రూ. 2 లక్షల వరకు నగదును బదిలీ చేసుకుని వెసులుబాటు ఉంది.