బీజేపీ మిత్ర పక్షం కూడా ! రైతుల ఆందోళనకు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ మద్దతు, ఢిల్లీకి 2 లక్షలమందితో భారీ ర్యాలీ

| Edited By: Pardhasaradhi Peri

Dec 26, 2020 | 2:41 PM

బీజేపీ మిత్ర పక్షమైన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ ఎల్ పీ) కూడా రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. రాజస్తాన్ లోని నాగౌర్ కి చెందిన ఎంపీ హనుమాన్ బేనివాల్ నేతృత్వంలోని ..

బీజేపీ మిత్ర పక్షం కూడా ! రైతుల ఆందోళనకు  రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ మద్దతు, ఢిల్లీకి 2 లక్షలమందితో భారీ ర్యాలీ
Follow us on

Farmers Protest:బీజేపీ మిత్ర పక్షమైన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ ఎల్ పీ) కూడా రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. రాజస్తాన్ లోని నాగౌర్ కి చెందిన ఎంపీ హనుమాన్ బేనివాల్ నేతృత్వంలోని  ఈ పార్టీ  ఆధ్వర్యాన భారీ సంఖ్యలో రైతులు శనివారం జైపూర్ సమీపంలోని కోట్ పుత్లి చేరుకున్నారు. వీరంతా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. కేంద్రంలో బీజేపీ మిత్ర పక్షమైన ఆర్ ఎల్ పీ-దాదాపు శిరోమణి అకాలీదళ్ బాటలోనే నడుస్తోంది. రైతు చట్టాల విషయంలో అకాలీదళ్.. ఎన్డీయే నుంచి వైదొలగిన సంగతి  తెలిసిందే. అవసరమైతే తాము కూడా అదేపని చేస్తామని హనుమాన్ బేనీవాల్ ఇటీవలే హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తాము రైతుల పక్షమేనని ఆయన ఇదివరకే ప్రకటించారు. రాజస్తాన్ లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు బేనివాల్ నాయకత్వాన ఢిల్లీకి చేరుకుంటారని, వీరి సంఖ్య సుమారు రెండు లక్షలవరకు ఉంటుందని ఈ పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఈ దేశంలో అన్నదాతలు రోడ్డున పడ్డారని, ప్రధాని మోదీ ఇప్పటికైనా పెద్ద మనసుతో వీరిని ఆదుకునేందుకు రైతు చట్టాలను రద్దు చేయాలని బేనివాల్ కోరారు. ఇలా ఉండగా కేంద్రంతో తిరిగి  చర్చల విషయమై నిర్ణయం తీసుకునేందుకు 40 రైతు సంఘాలు సమావేశమవుతున్నాయి. ఇప్పటికే ఇవి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాయి. తమ డిమాండ్లు తీరేవరకు ఒక్క మెట్టు కూడా దిగరాదని పలు రైతు సంఘాలు తీర్మానించాయి. మరోవైపు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ నుంచి కూడా అన్నదాతలు సింఘు బోర్డర్ చేరుకుంటున్నారు.

Read More:

ఇండియాలో రైతుల ఆందోళనకు విదేశాల్లో ప్రతిధ్వని, ఛలో ఢిల్లీకి ఎన్నారైల పిలుపు, 30 న సింఘు బోర్డర్ కు చేరిక

Strain virus: భ‌య ‌పెట్టిస్తున్న స్ట్రైయిన్ వైర‌స్.. లండ‌న్ నుంచి ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు 15 మంది