కోవిడ్ 19 వ్యాక్సీన్ డెవలప్ మెంట్ తదితర అంశాలగురించి తెలుసుకునేందుకు ప్రధాని మోదీ శనివారం దేశంలోని మూడు టాప్ కంపెనీలను విజిట్ చేశారు., వాటిలో పూణేలోని సీరం ఇన్స్ టి ట్యూట్ ఒకటి. అక్కడ ఆయన ఎక్కువసేపు గడిపారు. కాగా మోదీ పర్యటనపై ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే సెటైర్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ వ్యక్తి అయినా పర్యటించినా కోవిడ్ వ్యాక్సీన్ కేవలం పూణేలోనే ఉందనుకుంటాడు అన్నారు. అంటే ఈ నగరాన్ని దాటి ఏ టీకామందు కూడా ఉండదన్న మాట అని వ్యాఖ్యానించారు. అసలు వ్యాక్సీన్ ని కనుగొన్నది పునేకర్ అని, కానీ ఎవరైనా తానే కనుక్కున్నట్టు చెబుతాడని సుప్రియ అన్నారు.
పూణేలోని సీరం కంపెనీ కోవిడ్ 19 కోవిషీల్డ్ వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తోంది. ఇలాగే భారత్ బయో టెక్ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి కొవాగ్జిన్ ని, అహమమదాబాద్ లోని జైడస్ కేడిలా తన సొంత వ్యాక్సీన్ ని తయారు చేస్తోంది. హైదరాబాద్ లోని ‘బయలాజికల్ ఈ’ కంపెనీ తన టీకామందు మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్ ని ప్రారంభించింది. వచ్ఛే ఏడాది ఫిబ్రవరి నాటికీ దీని ఫలితాలు రావచ్చు. బెంగుళూరులోని మిన్ వాక్స్ సంస్థ కూడా టీకామందును ఉత్పత్తి చేస్తోంది. ఇక పూణే లొనే జెనోవా బయో ఫార్మా అనే మరో సంస్థ సైతం ఈ కృషిలో నిమగ్నమై ఉంది. దేశంలో ఇన్ని కంపెనీలు ఇలా వివిధ పేర్లతో వ్యాక్సీన్లు ఉత్పత్తి చేస్తుండగా ప్రధాని మోదీ కేవలం మూడు సంస్థలను విజిట్ చేయడాన్ని సుప్రియా సూలే పరోక్షంగా విమర్శించారు.