పుల్వామా దాడి ఘటనను ఈ దేశం ఎప్పటికీ మ‌ర‌వ‌దు : అజిత్ ధోవ‌ల్‌

| Edited By:

Mar 19, 2019 | 12:13 PM

హర్యానా : పుల్వామా ఉగ్రదాడిని ఈ దేశం ఎన్నటికీ మరవదన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన సీఆర్‌పీఎఫ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమర జవాన్ల త్యాగాలను తాను ఎప్పటికీ మరువనని కొనియాడారు. ఈ వేదికపై నుంచి తాను వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. దేశానికి సేవ చేయాల్సిన అవకాశం కొద్ది మందికే లభిస్తుందని.. అలాంటి అవకాశం మిలిటరీలో పనిచేసే ప్రతి […]

పుల్వామా దాడి ఘటనను ఈ దేశం ఎప్పటికీ మ‌ర‌వ‌దు : అజిత్ ధోవ‌ల్‌
Follow us on

హర్యానా : పుల్వామా ఉగ్రదాడిని ఈ దేశం ఎన్నటికీ మరవదన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన సీఆర్‌పీఎఫ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమర జవాన్ల త్యాగాలను తాను ఎప్పటికీ మరువనని కొనియాడారు. ఈ వేదికపై నుంచి తాను వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. దేశానికి సేవ చేయాల్సిన అవకాశం కొద్ది మందికే లభిస్తుందని.. అలాంటి అవకాశం మిలిటరీలో పనిచేసే ప్రతి జవాన్‌కు లభిస్తుందని అజిత్ ధోవల్ అన్నారు. ఉగ్రవాదుల ఆగడాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ దేశాన్ని రక్షిస్తున్న జవానులను దేశం ఎప్పటికీ మననంలోనే ఉంచుకుంటుందని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని అజిత్ దోవల్ అన్నారు.