పోలవరం ప్రాజెక్టుపై మరో విచారణ .. ఎందుకో తెలుసా?

పోలవరం ప్రాజెక్టు చుట్టు వివాదాల ముసురు కొనసాగుతూనే ఉంది. ప్రముఖ ఆర్ధిక వేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర జనవనరుల శాఖ విచారణకు ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణంలో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా విచారణకు రెడీ అయ్యింది. 2013లో పెంటపాటి పుల్లారావు జాతీయ పర్యవేక్షణ కమిటీకి దాఖలు చేసిన పిర్యాదుపై ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా […]

  • Publish Date - 5:47 pm, Mon, 14 October 19 Edited By:
పోలవరం ప్రాజెక్టుపై  మరో  విచారణ .. ఎందుకో తెలుసా?

పోలవరం ప్రాజెక్టు చుట్టు వివాదాల ముసురు కొనసాగుతూనే ఉంది. ప్రముఖ ఆర్ధిక వేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర జనవనరుల శాఖ విచారణకు ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణంలో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా విచారణకు రెడీ అయ్యింది. 2013లో పెంటపాటి పుల్లారావు జాతీయ పర్యవేక్షణ కమిటీకి దాఖలు చేసిన పిర్యాదుపై ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది.

పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ దీని నిర్మాణం విషయంలో నిర్వాసితులకు సరైన పరిహారం అందలేదని, దీంతో ఆయా ముంపు గ్రామాల ప్రజలు బాధితులుగా మిగిలిపోయారన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేలాది మంది ప్రజల జీవితాలు కష్టాలపాలయ్యాయని, వారి హక్కులు హరించబడ్డాయని పుల్లారావు తన పిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జాతీయ పర్యవేక్షణ కమిటీ ఆదేశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు రెడీ అయ్యింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం వేల కోట్ల అవినీతి జరిగిందని, అనుకన్న స్ధాయిలో పనులు జరగలేదనే ఆరోపణ వెల్లువెత్తాయి. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించి కోట్లాది రూపాయల నిధులకు బ్రేక్ వేసింది. తాజాగా పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిర్యాదులపై విచారణ జరుగుతుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతుంది.