జగన్ పథకానికి లోకేష్ ప్రశంస

ఆలిండియా చేనేత బోర్డుల పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్..ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి లేఖ రాశారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు..

జగన్ పథకానికి లోకేష్ ప్రశంస

Updated on: Sep 14, 2020 | 7:14 PM

ఆలిండియా చేనేత బోర్డుల పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్..ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి లేఖ రాశారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డులను కేంద్రం ఈ ఆగస్టులో రద్దు చేసిందని లోకేష్ గుర్తుకు తెచ్చారు. ఫలితంగా చేనేత కార్మికులు, ఈ పరిశ్రమపై ఆధారపడిన ఇతరులు ఇకపై కేంద్రాన్ని సాయం కోరాలంటే ఏ సంస్థ ద్వారా సంప్రదించాలనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘నేతన్న నేస్తం’ పథకం ఉద్దేశం అభినందనీయమే అయినా, అమలు విషయానికొచ్చేసరికి దారుణంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ పథకంలో ఎంతోమంది నేతన్నల పేర్లు చేర్చలేదని, పథకంలో నమోదైన వారికంటే తొలగించబడిన వారే ఎక్కువ మంది ఉన్నారని లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రం హఠాత్తుగా మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో, ఇటు రాష్ట్ర సహకారం కూడా కొరవడడంతో రాష్ట్ర చేనేత రంగ కార్మికులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని లోకేష్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us