అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంటిపైన, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతరకర రాతలు రాశారు. న్యూ ఇయర్ డే..శుక్రవారం నాడు వీరు తమ ఇళ్లపై ఈ రాతలు చూసి ఆశ్చర్యపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నపెలోసీ ఇంటిపై ‘$ 2 కె’ అని, ‘క్యాన్సిల్ రెంట్’ అని, ‘వుయ్ వాంట్ ఎవ్వెరీ థింగ్’ అని పెయింట్ తో రాశారు. స్ప్రే చేసిన ఈ రాతలు స్పష్టంగా ఉన్నాయి. ఈమె ఇంటి గ్యారేజ్ డోర్ పై ఇవి కనిపించాయి. ఇక శనివారం నాడు లూయిస్ విల్లె లోని మెక్ కావెల్ ఇంటి తలుపుపై ‘వేరీజ్ మై మనీ’ అని రాసి ఉంది. కిటికీమీద కూడా ఇదే రాత కనిపించింది. అమెరికాలోకరోనా వైరస్ అదుపునకు సంబంధించి సాయానికి ఉద్దేశించిన బిల్లును ఇటీవల డెమొక్రాట్లు ఆమోదించారు. స్టిములస్ చెక్ లను 600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు పెంచడానికి ఉద్దేశించిన బిల్లు ఇది … కాగా మన సమాజంలో పాలిటిక్స్ ఆఫ్ ఫియర్, వాండలిజం అన్నవాటికి స్థానం లేదని మెక్ కానెల్ వ్యాఖ్యానించారు. ఈయనతో బాటు నాన్సీ పెలోసీ ప్రతినిధులు కూడా ఈ రాతలను ఖండిస్తూ ప్రకటనలు చేశారు.