అంత్యక్రియలకు హాజరైన ఇద్దరికి కరోనా..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతడి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరికి కరోనా.

అంత్యక్రియలకు హాజరైన ఇద్దరికి కరోనా..!

Updated on: Jun 10, 2020 | 4:32 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతడి అంత్యక్రియలకు 14 మంది వ్యక్తులు హాజరయ్యారు. దీంతో శాంపిల్స్ సేకరించిన ఆరోగ్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో అదే గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని.. మిగతా 12 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ కోరారు. కరోనా తీవ్రతను గుర్తించి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us