మురళీ విజయ్ గుడ్ బై..!

|

Nov 12, 2019 | 8:22 PM

దేశం కోసం ఎంతోమంది క్రికెటర్లు ఆడాలని.. దేశవాళీ సిరీస్‌లలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంటారు. ఇక ప్రతిభతో పాటుగా కొందరికి లక్ కలిసిరావడంతో.. టీమిండియాలో చోటు దక్కుతుంది. అయితే టీమిండియా మాజీ టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం తాను ఎప్పుడూ దేశం కోసం ఆడాలని కోరుకోవట్లేదని.. కేవలం ఫ్యాషన్ కోసమే క్రికెట్ ఆడుతున్నానంటూ తన మనసులోని మాట బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ ఓపెనర్‌కు ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన […]

మురళీ విజయ్ గుడ్ బై..!
Follow us on

దేశం కోసం ఎంతోమంది క్రికెటర్లు ఆడాలని.. దేశవాళీ సిరీస్‌లలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంటారు. ఇక ప్రతిభతో పాటుగా కొందరికి లక్ కలిసిరావడంతో.. టీమిండియాలో చోటు దక్కుతుంది. అయితే టీమిండియా మాజీ టెస్ట్ ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం తాను ఎప్పుడూ దేశం కోసం ఆడాలని కోరుకోవట్లేదని.. కేవలం ఫ్యాషన్ కోసమే క్రికెట్ ఆడుతున్నానంటూ తన మనసులోని మాట బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ ఓపెనర్‌కు ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి.

గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిగా కనిపించిన మురళీ విజయ్.. ఆ తర్వాత టెస్ట్ జట్టులో స్థానం పూర్తిగా కోల్పోయాడని చెప్పాలి. మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలతో పాటు కేఎల్ రాహుల్ కూడా జట్టుకు అందుబాటులో ఉండటమే కాకుండా టెస్టుల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో విజయ్‌ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.  ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్.. వచ్చే ఏడాది సీఎస్‌కే జట్టులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

వచ్చే నెలలో సీఎస్‌కే వేలానికి విడుదల చేసే ప్లేయర్స్‌లో విజయ్ పేరు హిట్ లిస్ట్‌లో ఉందని చెప్పాలి. దాదాపు రెండు కోట్లతో విజయ్ చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. ఇక 2018,19 సీజన్లకు కేవలం 3 మ్యాచులు మాత్రమే ఆడిన విజయ్ 76 పరుగులు చేయడం గమనార్హం. దీంతో రెండు కోట్లు ఇస్తూ.. జట్టుకు విజయ్ వల్ల ఏ ప్రయోజనం లేనప్పుడు విడుదల చేయడం సబబు అని సీఎస్‌కే జట్టు భావిస్తోంది. కాగా, విజయ్‌తో పాటు శార్దూల్ ఠాకూర్, కరణ్ శర్మలను కూడా ఆ జట్టు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిందట.