మరోసారి బాలివుడ్ లో డ్రగ్స్ దందా ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారలు దాడి చేశారు. శనివారం ఉదయం భారతి సింగ్ నివాసంతో పాటు ఆమె భర్త హర్ష్ లిబచియా ఇళ్లల్లో ఏకకాలంలో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక ఆధారాలు అభించినట్లు సమాచారం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు సంబంధించి బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్‌సీబీ ఇటీవల ముంబైలో పలు చోట్ల ముమ్మరంగా దాడులు జరిపింది. పలువురు సెలబ్రెటీల ఇళ్లు, కార్యాలయాలతో పాటు అనుమానితుల ఇళ్లలోనూ సోదాలు జరిపింది. ఇదే క్రమంలో భారతి సింగ్ నివాసంపై ఎన్‌సీబీ దాడి చేసింది. అంతకుముందు నటుడు అర్జున్ రాంపాల్, ఆయన పార్టనర్ గాబ్రియేలా డెమిట్రియాడెస్‌ను డ్రగ్స్ కేసులో ఇటీవల ఎన్‌సీబీ ప్రశ్నించింది. నిర్మాత ఫెరోజ్ ఎ.నడియాడ్‌వాలా భార్యను అరెస్టు చేసింది. టీవీ జంట సనమ్ జోహర్, అబిజైల్ పాండేల ఇళ్లలోనూ సోదాలు జరిపింది.
కాగా, భారతి సింగ్ ఇటీవల కపిల్ శర్మ షోలో కనిపించారు. లల్లీ అనే కమిడెయిన్ పాత్రను అందులో పోషిస్తున్నారు. 2017 డిసెంబర్ 3న హర్ష్‌తో భారతి వివాహమైంది. ప్రస్తుతం ఆమె తన భర్త హర్ష్ లిబచియాతో కలిసి ఇండియాస్ బెస్ట్ డాన్సర్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఝలక్ థిఖ్లా జా, నాచ్ బలియే వంటి పలు రియాల్టీ షోలకూ ఆమె పనిచేశారు.
Maharashtra: Comedian Bharti Singh and her husband Harsh Limbachiyaa arrive at Narcotics Control Bureau (NCB) office in Mumbai.
NCB conducted raid at their residence, earlier today. pic.twitter.com/7nVuUKdq23
— ANI (@ANI) November 21, 2020