Drugs Case : డ్రగ్స్ కేసులో నటి శ్వేతా కుమారిని ఎన్సీబీ కస్టడీకి అప్పగించిన ముంబై కోర్టు

|

Jan 05, 2021 | 10:07 PM

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన  నటి శ్వేతాకుమారిని ముంబై న్యాయస్థానం ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది. మూడు రోజుల పాటు శ్వేతాకుమారిని విచారించేందుకు...

Drugs Case : డ్రగ్స్ కేసులో నటి శ్వేతా కుమారిని ఎన్సీబీ కస్టడీకి అప్పగించిన ముంబై కోర్టు
Follow us on

Drugs Case : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన  నటి శ్వేతాకుమారిని ముంబై న్యాయస్థానం ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది. మూడు రోజుల పాటు శ్వేతాకుమారిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. గత శనివారం డ్రగ్స్ కేసులో NCB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది శ్వేతా. శ్వేతాకుమారి ‌ చాలా కన్నడ సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించారు.

ముంబైలో డ్రగ్స్‌ సప్లయర్‌ చాంద్‌ మహ్మద్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతడు ఇచ్చిన సమాచారంతో శ్వేతాకుమారిని అరెస్ట్‌ చేశారు. 400 గ్రాముల మెపెడ్రిన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రగ్ లింక్‌లపై ఆరా తీస్తున్నారు. అయితే ముంబైలో తెలుగు నటి డ్రగ్ కేసులో పట్టుబడటం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్‌ కేసులో శ్వేతాకుమారిని విచారించిన తరువాత మరిన్ని విషయాలు వెలుగు లోకి వచ్చే అవకాశముందన్నారు ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే.