భారత క్రికెట్ జట్టుకు సారథిగా ఎన్నో గొప్ప, గొప్ప విజయాలు అందించిన ధోని చడీచప్పుడు కాకుండా శనివారం రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో అతడి అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వికెట్ల వెనుక ధోని లేకుండా ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, సహచర ఆటగాళ్లు ధోని రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. ధోని ఇండియాకు ఇచ్చిన మరుపురాని విజయాలను కీర్తిస్తున్నారు. ఇక ధోని రిటైర్మెంట్‌పై ఆయన భార్య సాక్షిసింగ్ కూడా స్పందించారు. భారతజాతి గర్వపడేలా ధోని ఎన్నో విజయాలను అందించాడని… ప్రజలు వాటిని మర్చిపోవచ్చుగానీ.. ఆ క్షణంలో వారికి ఆయన అందించిన పీలింగ్ మర్చిపోలేనిదని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. వీడ్కోలు చెప్పినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్వపడుతున్నాను. ఎంతో ఇష్టమైన క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే క్రమంలో మీరు పడిన మానసిక ఆందోళన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగి… రిటైర్మెంట్ ప్రకటించారని భావిస్తున్నాను. మీరు ఎల్లప్పడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, అందించిన విజయాలు ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన ఫీలింగ్ ఎప్పుడూ మర్చిపోలేరు’అని సాక్షిసింగ్ ధోని పేర్కొన్నారు.
Also Read :
రాంచీలో ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్ !