ధోనీలో క్రిస్‌ గేల్‌ను చూశారా..

Dhoni imitates Chris Gayle’s Walking : ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌ తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ను చెన్నై కెప్టెన్‌ […]

ధోనీలో క్రిస్‌ గేల్‌ను చూశారా..

Updated on: Oct 07, 2020 | 6:07 AM

Dhoni imitates Chris Gayle’s Walking : ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌ తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ను చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఎదురుపడ్డాడు . గేమ్‌ ఆఫ్‌ ద స్పిరిట్‌లో భాగంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరి నొకరు అభినందించుకునే క్రమంలో గేల్‌తో ధోని ముచ్చటించాడు. అయితే గేల్ ఎదురుగా వస్తుండటంతో… అదే సమయంలో గేల్‌ను అనుకరించే యత్నం చేశాడు ధోని.

గేల్‌ ఎలా నడుస్తాడో దాన్ని అతనే ఎదుటే చేసి నవ్వులు పూయించాడు. దీనికి గేల్‌ కూడా నవ్వుకుంటా వచ్చి ధోనితో కాసేపు మాట్లాడాడు. ఇద్దరూ ఒకర్నినొకరు విష్‌ చేసుకుని తర్వాత మ్యాచ్‌ విశేషాలను షేర్‌ చేసుకున్నారు. గేల్‌ను అనుకరిస్తూ ధోని నడిచిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us