కొత్త సంవత్సరంలో ఆరంభంలోనే పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు సాప్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందించనున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఇదే బాటలో మోటోరోలా కూడా అండ్రాయిడ్ 11 అప్‌డేట్ ను అందుకోబోయే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్స్‌తో పాటు ఇతర ఫీచర్లను అందించనుంది. 2019, 2020 లో లాంచ్ చేసిన మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా ఈ అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. ఆండ్రాయిడ్ 11 తో పాటు చాట్ బబుల్స్ తో సహా మరెన్నో ఫీచర్లను ఈ అప్‌డేట్ ద్వారా అందించనున్నట్లు మోటోరోలా పేర్కొంటోంది..
మోటోరోలా చాట్ బబుల్స్, స్ట్రీమ్లైన్డ్ డివైస్, మీడియా కంట్రోల్స్ మరియు ఇతర ముఖ్యమైన ప్రైవసీ సెక్యూరిటీ సెట్టింగులతో సహా కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేయనున్నట్లు మోటోరోలా తన బ్లాగులో వెల్లడించింది. దీనిని బట్టి కాబట్టి ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ అందుకోబోయే అవకాశమున్న మోటోరోలా ఫోన్ల జాబితా ఇదే…
motorola razr 5G
motorola razr 2019
motorola edge
motorola edge+
motorola one 5G
motorola one action
motorola one fusion
motorola one fusion+
motorola one hyper
motorola one vision
moto g 5G
moto g 5G plus
moto g fast
moto g power
moto g pro
moto g stylus
moto g9
moto g9 play
moto g9 plus
moto g9 power
moto g8
moto g8 power
Lenovo K12 Note
పైన పేర్కొన్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో లేవు. ఈ లిస్టులో మోటోరోలా రేజర్ 5జి, మోటోరోలా రేజర్ 2019, మోటోరోలా ఎడ్జ్, మోటోరోలా ఫ్యూజన్ +, మోటో జీ 5జీ, మోటో జీ9, మోటో జీ9 పవర్ వంటి స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి.