కార్టూన్ ఛానల్ చూడనివ్వ లేదని..

కార్టున్లు చూడనివ్వడం లేదని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కార్టూన్ ఛానల్ చూడనివ్వ లేదని..

Updated on: Jun 10, 2020 | 3:53 PM

క్షణికావేశం ఓ పసివాడి నిండు ప్రాణం బలి తీసుకుంది. తనని కార్టున్లు చూడనివ్వడం లేదని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాక్ డౌన్ తో పాఠశాలలు మూత పడడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలతో పాటు పెద్దలకు టీవీలకు అతుక్కుపోయారు. ఇదే క్రమంలో పుణేలో ఓ బాలుడు కార్టున్లు చూస్తానని టీవీలో చానల్‌ మార్చబోయాడు. కానీ అతడి నాయనమ్మ న్యూస్ చూస్తోంది. ఇద్దరి మధ్య కాసేపు వాదనలు జరిగాయి. ఇది చూసిన బాలుడి తల్లి.. టీవీ ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us