అమ్మకు బాసటగా.. కుటుంబానికి అంతా తానైన 14 ఏళ్ల బాలుడు..!

|

Oct 30, 2020 | 4:12 PM

కరోనా మహమ్మారి దెబ్బకు చాలామంది జీవితాలు తలక్రిందులు అయ్యాయి. కొవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. అలాగే ముంబైకి చెందిన సుభాన్..

అమ్మకు బాసటగా.. కుటుంబానికి అంతా తానైన 14 ఏళ్ల బాలుడు..!
Follow us on

Mumbai Teen Takes To Selling Tea: కరోనా మహమ్మారి దెబ్బకు చాలామంది జీవితాలు తలక్రిందులు అయ్యాయి. కొవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. అలాగే ముంబైకి చెందిన సుభాన్ కుటుంబం కూడా కరోనా కారణంగా రోడ్డున పడ్డారు. దీనితో ఆ కుటుంబానికి అంతా తానై 14 ఏళ్ల సుభాన్. టీ అమ్మడం మొదలుపెట్టాడు. అటు ఉద్యోగం కోల్పోయిన అమ్మను చూసుకుంటూ.. చెల్లెళ్ళ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఇంటి వద్దనే టీను తయారు చేసుకుని.. వీధి వీధి తిరుగుతూ విక్రయిస్తున్నాడు.

”తన తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోయారని.. అప్పటి నుంచి తన తల్లి స్కూల్ బస్సు అటెండర్‌గా పని చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తోందని సుభాన్ తెలిపాడు. లాక్‌డౌన్‌ కారణంగా తన తల్లి ఉపాధి కోల్పోవడంతో కుటుంబం ఆర్ధికంగా కష్టాలలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే కుటుంబాన్ని పోషించేందుకు టీ అమ్ముతున్నానని.. దాని ద్వారా రోజుకు రూ. 300-400 వస్తాయని అన్నాడు. వాటిని తన తల్లికి ఇస్తానని పేర్కొన్నాడు. తన చెల్లెళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు చదువుకుంటున్నారని.. స్కూల్స్ రీ-ఓపెన్ అయ్యాక తాను కూడా స్కూల్‌కు వెళ్తానని సుభాన్ తెలిపాడు.

Also Read:

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

గంగవ్వ బాటలో బిగ్ బాస్ హౌస్‌ను వీడిన నోయల్.!