ప్రముఖ నేపథ్య గాయకుడు, గాన గంధర్వి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఆయన
చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్స్‌పై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని, విదేశీ వైద్యుల సూచనల మేరకు ఎక్మో పరికరంతో బాలుకి చికిత్స అందిస్తున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
మరోవైపు, యావత్ ప్రపంచంలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. అభిమానులు, సెలబ్రిటీలు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇతర భాషలలో కొన్ని దశాబ్ధాలుగా సంగీత ప్రియులని పరవశింపజేస్తున్న లెజండరీ సింగర్ బాలసుబ్రహ్యణ్యం త్వరగా సంపూర్ణ ఆరోగ్మంతో కోలుకుని ప్రార్ధిస్తున్నానంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు హరీష్ రావు.
#SPBalasubrahmanyam
a legendary singer who has entertained music lovers for decades with his songs, has made his mark in Telugu, Tamil, Kannada, Hindi and other languages. I pray for his speedy recovery. pic.twitter.com/aSQF4LS9Gk— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 20, 2020