భారత, చైనా దేశాల మధ్య కొనసాగనున్న చర్చలు

భారత, చైనా దేశాల మధ్య శనివారం జరిగిన మిలిటరీ స్థాయి చర్చలు పెద్దగా ఫలితాలనివ్వలేదు. అందువల్లే లడఖ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద వివాద పరిష్కారానికి సైనిక, దౌత్య స్థాయి..

  • Umakanth Rao
  • Publish Date - 12:39 pm, Mon, 8 June 20
భారత, చైనా దేశాల మధ్య కొనసాగనున్న చర్చలు

భారత, చైనా దేశాల మధ్య శనివారం జరిగిన మిలిటరీ స్థాయి చర్చలు పెద్దగా ఫలితాలనివ్వలేదు. అందువల్లే లడఖ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద వివాద పరిష్కారానికి సైనిక, దౌత్య స్థాయి చర్చలను కొనసాగించాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు బోర్డర్ లో పరిస్థితి యధాతధంగా ఉండేలా చూసేందుకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని రెండు దేశాలూ  ఏకాభిప్రాయానికి వఛ్చినట్టు తెలుస్తోంది. దౌత్య స్థాయిలో జరిపే చర్చల వల్ల కొంతవరకు సానుకూల ఫలితాలను సాధించవచ్ఛునని భావిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.వివాదాస్పద భూభాగాల్లో చైనా తన సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని, నిర్మాణాలను నిలిపివేయాలని భారత్ కోరుతోంది. ఇందుకు చైనా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ.. చైనా సైనికుల యుధ్ధ సన్నాహాలు ఇండియాకు ఆందోళన కలిగిస్తున్నాయి.