మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య పెద్ద మనసు

|

Sep 13, 2020 | 8:33 PM

ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా ఉత్పాతం వేళ లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య పెద్ద మనసు
Follow us on

ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా ఉత్పాతం వేళ లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు నడుంబిగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్‌ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు. అనుపమ ఇచ్చిన ఆర్థిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ వైవీ మల్లారెడ్డి చెప్పారు. కాగా, అనుపమ తండ్రి వేణుగోపాల్‌ ఐఏఎస్‌ అధికారి కావడంతో ఆమె కూడా దేశమంతా తిరిగారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలపై అనుపమకు అవగాహన ఉంది.