భారీ భూకంపంతో వణికిన మెక్సికో.. సునామీ అలర్ట్..

గళవారం మెక్సికో భూకంపంతో వణికిపోయింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. మెక్సికోలోని దక్షిణ,మధ్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.

భారీ భూకంపంతో వణికిన మెక్సికో.. సునామీ అలర్ట్..
Earthquake

Updated on: Jun 24, 2020 | 11:24 AM

మంగళవారం మెక్సికో భూకంపంతో వణికిపోయింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. మెక్సికోలోని దక్షిణ,మధ్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఒక్సాకాలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు.. అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. అంతేకాదు.. ఈ భూకంపంతో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అమెరికా, కెనడా దేశాలకు చెందిన పర్యాటకులు సందర్శించే హువాతుల్లో బీచ్‌లో సునామీ వచ్చే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, మంగళవారం వచ్చిన భూకంపం దాటికి.. ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఒక్సాకా రాష్ట్ర పరిసరాల్లో దాదాపు 200కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని.. ఆ రాష్ట్ర గవర్నర్‌ ప్రకటించారు. దాదాపు రెండు నిమిషాలపాటు ప్రకంపనలు రావడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అంతా ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us