నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగు

|

Sep 08, 2020 | 3:26 PM

హైదరాబాద్‌లో సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో ట్రైన్ అందుబాటులోకి వస్తే..ఈ రోజు నాగోల్‌ - రాయదుర్గం మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి..

నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగు
Follow us on

హైదరాబాద్‌లో సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో ట్రైన్ అందుబాటులోకి వస్తే..ఈ రోజు నాగోల్‌ – రాయదుర్గం మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైళ్లు నడవనున్నాయి.

ఉప్పల్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రయాణం పునఃప్రారంభమైంది. కరోనా ప్రభావంతో ప్రయాణీకుల రద్దీ చాలా తక్కువగా ఉంది. మెట్రో రైల్ స్టేషన్‌లలో శానిటైజేషన్, ధర్మల్ స్ర్ర్కీనింగ్ తప్పనిసరిగా చేస్తున్నారు. అయితే ప్రయాణీకుల సందడి పెద్దగా లేదు. కరోనా నేపథ్యంలో మెట్రో యాజమాన్యం అన్నిజాగ్రత్తలు తీసుకుంది.

తొలిరోజు() మెట్రో రైళ్లు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మొత్తం 120 ట్రిప్పులతో 19వేల మందిని గమ్యస్థానాలకు మెట్రో రైలు చేర్చింది. అధికారులు తీసుకున్న భద్రత చర్యలపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అయితే కంటైన్‌మెంట్‌ జోన్లుగా నిర్ధారించిన ప్రాంతాల్లో మాత్రం మెట్రో స్టేషన్లను మూసివుంచారు.

ఇందులో  గాంధీ హాస్పిటల్‌, భరత్‌నగర్‌, మూసాపేట, యూసఫ్‌గూడ మెట్రోస్టేషన్ల మూసి ఉండనున్నాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడంవల్ల ప్రయాణీకుల సంఖ్య తగ్గిందని అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని సిబ్బంది భావిస్తున్నారు.