Melania Trump మెలనియా స్కూలు విజిట్.. కేజ్రీ ఔట్‌పై యుఎస్ వివరణ

| Edited By: Pardhasaradhi Peri

Feb 24, 2020 | 1:34 PM

ట్రంప్ భార్య మెలనియా తన భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూల్లో 'హ్యాపీనెస్ క్లాస్' కార్యక్రమానికి హాజరైనప్పడు దానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,

Melania Trump మెలనియా స్కూలు విజిట్.. కేజ్రీ ఔట్‌పై  యుఎస్ వివరణ
Follow us on

Melania Trump: ట్రంప్ భార్య మెలనియా తన భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూల్లో ‘హ్యాపీనెస్ క్లాస్’ కార్యక్రమానికి హాజరైనప్పడు దానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియాలను ఆహ్వానించకుండా వారి పేర్లను డ్రాప్ చేయడంపై అమెరికా క్లారిటీ ఇచ్చింది. ఈ ఈవెంట్‌ను రాజకీయం చేయకూడదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. నిజానికి ఈ ఇద్దరు నేతలూ హాజరైనా తమకు అభ్యంతరం లేదని,  కానీ ఇది రాజకీయ కార్యక్రమం కాదని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం విద్య, స్కూలు, విద్యార్థులకు సంబంధించిన అంశమని అన్నారు. అటు-మనీష్ శిశోడియా ఆ తరువాత ఓ ప్రకటన చేస్తూ.. ఈ విషయంలో అగ్రరాజ్యం వెలిబుచ్చిన ఆందోళనను తాము అర్థం చేసుకున్నామని అన్నారు. ఆ దేశ అభిప్రాయాలను మేం గౌరవిస్తున్నాం అని శిశోడియా పేర్కొన్నారు. స్కూలు విద్యార్థుల్లో స్ట్రెస్ ను తగ్గించడానికి ఈయన రెండేళ్ల క్రితమే ప్రత్యేకమైన కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ సబ్జెక్టు కింద సుమారు 40 నిముషాల పాటు విద్యార్థులు యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్ వంటి అంశాల్లో పాల్గొంటారు. తద్వారా వారిలో విద్యా సంబంధమైన ప్రెషర్ (ఒత్తిడి) తగ్గుతుందని అప్పట్లోనే ప్రభుత్వం భావించింది.