కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ: నిమ్స్‌లో రూ.18 కోట్లతో అధునాతన టెక్నాలజీతో ‘మేఘా’ నిర్మించిన క్యాన్సర్ సెంటర్ అందుబాటులోకి

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2021 | 3:24 PM

Corporate social responsibility: హైదరాబాద్‌లోని చారిత్రక ఆస్పత్రి నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో నేటి నుంచి క్యాన్సర్ రోగులకు..

కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ: నిమ్స్‌లో రూ.18 కోట్లతో అధునాతన టెక్నాలజీతో మేఘా నిర్మించిన క్యాన్సర్ సెంటర్ అందుబాటులోకి
Follow us on

Corporate social responsibility: హైదరాబాద్‌లోని చారిత్రక ఆస్పత్రి నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో నేటి నుంచి క్యాన్సర్ రోగులకు కూడా ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది. అధునాతన టెక్నాలజీ, అత్యాధునిక సౌకర్యాలతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ NIMSలో ఏర్పాటు చేసిన ఆంకాలజీ వార్డు ఇవాళ ప్రారంభం కానుంది. నిమ్స్‌లో రూ.18 కోట్లతో MEIL (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) నిర్మించిన క్యాన్సర్ విభాగంను MEIL ఛైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డిలతో కలిసి తెలంగాణ వైద్యశాఖమంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించనున్నారు. 50 పడకలతో క్యాన్సర్ పేషెంట్ల చికిత్సకు ప్రత్యేక వార్డులను మేఘా సంస్థ సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసింది. ః

అంతేకాదు, పిల్లల క్యాన్సర్, లుకేమియా రోగుల చికిత్స కోసం కూడా మేఘా సంస్థ నిర్మించిన అధునాతన వార్డులు కూడా ఇవాళ్టి నుంచే రోగులకు అందుబాటులోకి రానున్నాయి. పేషెంట్లకు అనుక్షణం సేవలందించేందుకు వార్డుల్లోనే నర్సింగ్ స్టేషన్లు కూడా మేఘా సంస్థ ఏర్పాటు చేయడం విశేషం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటిలో భాగంగా ఈ పనులు చేపట్టిన మేఘా సంస్థ,‌ మహిళలు, పురుషులు, చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు సైతం నిమ్స్ లో కొత్తగా నెలకొల్పడం విశేషం.  మేఘా ఇంజినీరింగ్ సామాజిక బాధ్యత, అత్యున్నత సౌకర్యాలతో నిమ్స్‌లో నిర్మించిన ఆంకాలజీ బ్లాక్ 9న ప్రారంభం