MCG To Hold Two Matches: భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కు కరోనా సెగ తగిలింది. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. చివరి రెండు టెస్టుల వేదికలను మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జనవరి 7వ తేదీన సిడ్నీలో జరగాల్సిన మూడో టెస్టును బ్రిస్బేన్ కు, జనవరి 15న బ్రిస్బేన్ వేదికగా నిర్వహించాల్సిన 4వ టెస్టును సిడ్నీకి మార్చనున్నారు. ఒకవేళ ఇది కుదరకపోతే ఆఖరి టెస్టును మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఆసిస్ 1-0 అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read:
‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!
ఆన్‌లైన్ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!