భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ లెబనాన్‌..!

| Edited By:

Aug 04, 2020 | 11:24 PM

లెబనాన్‌లో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించింది. రాజధాని బీరుట్‌లోని పోర్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు..

భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ లెబనాన్‌..!
Follow us on

లెబనాన్‌లో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించింది. రాజధాని బీరుట్‌లోని పోర్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు సంభవించిన ప్రదేశమంతా దట్టమైన పొగలతో కమ్ముకుపోయింది. పేలుడు ధాటికి.. అక్కడ ఉన్న ఇళ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో అనేక జిల్లాలకు విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ఓ ఫ్యాక్టరీలో భారీగా టపాకాయలు నిల్వా చేయడం వల్లే ఈ పేలుడు జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచానా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణనష్టం వాటిల్లిందన్నది ఇప్పటికీ ఓ క్లారటీ రాలేదు. అంతేకాదు.. ఎంత మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారన్నది కూడా సమాచారం లేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు