ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శామ్యూల్స్‌

|

Nov 04, 2020 | 5:23 PM

వెస్టిండీస్‌ క్రికెటర్‌ మార్లన్‌ శామ్యూల్స్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.. ఇక నుంచి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.. 2018 డిసెంబర్‌ తర్వాత శామ్యూల్స్‌ వెస్టిండీస్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.. ఇక ఆడే అవకాశం కూడా రాదేమోననుకుని శామ్యూల్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు శామ్యూల్స్‌. మొత్తం 71 టెస్ట్‌ మ్యాచ్‌లు, 207 వన్డేలు, 67 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.. అన్ని ఫార్మాట్లు కలిపి […]

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శామ్యూల్స్‌
Follow us on

వెస్టిండీస్‌ క్రికెటర్‌ మార్లన్‌ శామ్యూల్స్‌ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.. ఇక నుంచి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.. 2018 డిసెంబర్‌ తర్వాత శామ్యూల్స్‌ వెస్టిండీస్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.. ఇక ఆడే అవకాశం కూడా రాదేమోననుకుని శామ్యూల్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు శామ్యూల్స్‌. మొత్తం 71 టెస్ట్‌ మ్యాచ్‌లు, 207 వన్డేలు, 67 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.. అన్ని ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులు చేశాడు.. 17 ఇంటర్నేషనల్‌ సెంచరీలు ఇతని ఖాతాలో ఉన్నాయి. ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ అయిన శామ్యూల్స్‌ 152 వికెట్లు కూడా తీసుకున్నాడు.. 2012, 2106లలో వెస్టిండీస్‌ ఐసీసీ టీ-20 టైటిల్స్‌ను గెల్చుకుంది.. ఈ రెండు విజయాలలో శామ్యూల్స్‌ ప్రధాన భూమికను పోషించాడు. అలాగే 2016 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో అజేయంగా 85 పరుగులు చేసి టీ20 ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌తో కలిసి శామ్యూల్స్‌ రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించాడు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంటాడు శామ్యూల్స్‌..