కరోనా కల్లోలం.. 24 గంటల్లో 112 మంది పోలీసులకు కరోనా..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో మ‌హారాష్ట్ర పోలీస్ శాఖ‌లో

కరోనా కల్లోలం.. 24 గంటల్లో 112 మంది పోలీసులకు కరోనా..!

Updated on: Aug 18, 2020 | 2:17 PM

Coronavirus In Maharashtra: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో మ‌హారాష్ట్ర పోలీస్ శాఖ‌లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 112 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోలీస్‌శాఖలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 12,495కు చేరింది. మంగళవారం వరకు 10,111 మంది పోలీసులు కోలుకున్నారు.

తాజాగా.. మహారాష్ట్రలో కొత్తగా 8,493 కరోనా కేసులు నమోదు కాగా 228 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,358కు చేరుకుంది. ప్రస్తుతం పోలీస్ శాఖ‌లో 2,256 మంది సిబ్బంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. 24 గంటల్లో మరో ఇద్దరు మృతి చెందడంతో కరోనాతో మరణించిన పోలీసుల సంఖ్య 128కి పెరిగింది.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!

 

Loading...
Unable to load recommendations.
Follow Us