టిక్‌‌టాక్‌ యాప్‌ను నిషేదించాలి: మద్రాసు హైకోర్టు

టిక్‌టాక్.. ఈ యాప్ తెలియని వారుండరు. యువతలో దీనికి మంచి క్రేజ్ ఉంది. వాట్సాప్‌లో స్టేటస్‌లు.. ఫేస్‌బుక్‌లో పోస్టింగులతో.. ఇలా ఎక్కడ చూసినా టిక్‌టాక్ వీడియోలే. అయితే.. వీటి వల్ల అశ్లీలత, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని.. దీన్ని నిషేదించాలని ఇప్పటికే పలువురు కేసులు కూడా నమోదు చేశారు. అయితే.. తాజాగా మద్రాసు హైకోర్టు కూడా టిక్‌టాక్‌ను నిషేదించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా.. ఇటీవలె తమిళనాడు పార్లమెంట్‌లో ఈ టిక్‌టాక్‌పై పెద్ద చర్చే నడిచింది. చాలా […]

టిక్‌‌టాక్‌ యాప్‌ను నిషేదించాలి: మద్రాసు హైకోర్టు

Edited By:

Updated on: Apr 04, 2019 | 3:57 PM

టిక్‌టాక్.. ఈ యాప్ తెలియని వారుండరు. యువతలో దీనికి మంచి క్రేజ్ ఉంది. వాట్సాప్‌లో స్టేటస్‌లు.. ఫేస్‌బుక్‌లో పోస్టింగులతో.. ఇలా ఎక్కడ చూసినా టిక్‌టాక్ వీడియోలే. అయితే.. వీటి వల్ల అశ్లీలత, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని.. దీన్ని నిషేదించాలని ఇప్పటికే పలువురు కేసులు కూడా నమోదు చేశారు. అయితే.. తాజాగా మద్రాసు హైకోర్టు కూడా టిక్‌టాక్‌ను నిషేదించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కాగా.. ఇటీవలె తమిళనాడు పార్లమెంట్‌లో ఈ టిక్‌టాక్‌పై పెద్ద చర్చే నడిచింది. చాలా మంది వీటి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముత్తు కుమార్ తమిళనాడు అసెంబ్లీలో టిక్‌టాక్ రద్దు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పీకర్‌ కూడా సానుకూలంగా స్పందించి, త్వరలోనే దీనిపై కేంద్రంతో మాట్లాడతామని తెలిపారు.