10 లక్షలు దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

Oct 09, 2020 | 6:00 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 10 లక్ష లు దాటాయి. తొలి రోజు నుంచి గురువారం సాయంత్రానికి 10,04,870 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు రుసుము రూపంలో రూ.10.23 కోట్లు సమకూరాయని అధికారులు తెలిపారు. కార్పొరేషన్‌ల పరిఽధిలో 2,00,078, మునిసిపాలిటీల పరిఽధిలో 4,02,882, గ్రామ పంచాయతీల పరిధిలో 4,01,910 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 15 వరకు సమయముందని అన్నారు. సెప్టెంబరు 1వ తేదీన ఎల్‌ఆర్‌ఎ్‌సను […]

10 లక్షలు దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..
Follow us on

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 10 లక్ష లు దాటాయి. తొలి రోజు నుంచి గురువారం సాయంత్రానికి 10,04,870 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు రుసుము రూపంలో రూ.10.23 కోట్లు సమకూరాయని అధికారులు తెలిపారు. కార్పొరేషన్‌ల పరిఽధిలో 2,00,078, మునిసిపాలిటీల పరిఽధిలో 4,02,882, గ్రామ పంచాయతీల పరిధిలో 4,01,910 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

దరఖాస్తుల సమర్పణకు ఈనెల 15 వరకు సమయముందని అన్నారు. సెప్టెంబరు 1వ తేదీన ఎల్‌ఆర్‌ఎ్‌సను ప్రకటించారు. ఆనెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు  తీసుకుంటున్నారు. ఇంకా వారం రోజుల గడువున్నందున… దరఖాస్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. సందిగ్ధంలో ప్రారంభంలో కొందరు దరఖాస్తు చేయలేదు.

ఎల్‌ఆర్‌ఎ్‌సపై కోర్టులో కేసు దాఖలవడంతో వేచిచూసే ధోరణిలో మరికొందరు దరఖాస్తు చేయలేదు. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ లేనిపక్షంలో రిజిస్ర్టేషన్‌లు జరిగే అవకాశం లేకపోవడం, నిర్మాణాలకు అనుమతించకపోవడం వంటి నిబంధనలతో ఆందోళనలో ఉన్న యజమానులు… దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువును మరికొంత సమయం పొడిగించవచ్చని సమాచారం. ఎల్‌ఆర్‌ఎ్‌సపై విస్తృత ప్రచారం కల్పించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని వారు చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారని తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు సందర్భంగానూ ఖాళీ స్థలాల ఆస్తుల నమోదు అంశం తెరమీదకు వచ్చింది. దీంతో, స్థలాలను రిజిస్టర్‌ చేసుకోవడం, ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోవడంపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో మరికొంత అవగాహన పెరుగుతోందని, గడువు పొడిగిస్తే… మరికొన్ని దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలను తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గ్రామీణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.