వెంకన్న ఆభరణాలకిక మరింత భద్రత

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించింది టీటీడీ ట్రస్టు బోర్డు. అందుకోసం నూతన టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానంలో వెంకన్న ఆభరణాలకు భద్రత కల్పించడంతోపాటు.. పారదర్శక విధానంలో వాటి వివరాలు అందుబాటులో వుంటాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి ఆభరణాలకు మరింత భద్రత కల్పించేందుకు కొత్త టెక్నాలజీని వాడబోతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లతో ఆభరణాలను భద్రపరచే యోచనలో టీటీడీ అధికారులున్నారు. ప్రస్తుతం ఆభరణాల వివరాలను […]

వెంకన్న ఆభరణాలకిక మరింత భద్రత

Updated on: Jan 18, 2020 | 3:45 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించింది టీటీడీ ట్రస్టు బోర్డు. అందుకోసం నూతన టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానంలో వెంకన్న ఆభరణాలకు భద్రత కల్పించడంతోపాటు.. పారదర్శక విధానంలో వాటి వివరాలు అందుబాటులో వుంటాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

శ్రీవారి ఆభరణాలకు మరింత భద్రత కల్పించేందుకు కొత్త టెక్నాలజీని వాడబోతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లతో ఆభరణాలను భద్రపరచే యోచనలో టీటీడీ అధికారులున్నారు. ప్రస్తుతం ఆభరణాల వివరాలను పరిశీలించడానికి బార్ కోడ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు అధికారులు. అయితే బార్ కోడ్ విధానంతో ఉపయోగం లేదని తాజాగా టీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లతో మరింత భద్రత ఉంటుందంటున్న అధికారులు కొత్త టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. టీటీడీ బోర్డులో నిర్ణయం తర్వాత కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే దిశగా చర్యలు ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us