కార్తీతో ఓకే, కమల్‌తో కూడా అదే స్పీడా..లోకనాయకుడితో యువ దర్శకుడు హిట్ కొడతాడా?

|

Nov 12, 2020 | 9:28 PM

లోకనాయకుడు కమల్‌ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ 'విక్రమ్'‌. ఖైదీ ఫేం లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్‌ కిల్లర్‌గా కనిపించనున్నారు.

కార్తీతో ఓకే, కమల్‌తో కూడా అదే స్పీడా..లోకనాయకుడితో యువ దర్శకుడు హిట్ కొడతాడా?
Follow us on

లోకనాయకుడు కమల్‌ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ ‘విక్రమ్’‌. ఖైదీ ఫేం లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్‌ కిల్లర్‌గా కనిపించనున్నారు. కమల్‌ బర్త్‌ డే సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా మీద అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కోసం కమల్ కేవలం 32 రోజుల కాల్షీట్స్‌ ఇచ్చారట. అంతేకాదు పూర్తిగా సినిమాను 60 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు లోకేష్ కనగరాజ్‌. ఖైదీ సినిమాను కూడా రికార్డ్ టైంలో కంప్లీట్ చేసిన లోకేష్.. కమల్‌ లాంటి యూనివర్సల్‌ స్టార్ సినిమాను కూడా అంతే షార్ట్ టైంలో పూర్తి చేస్తానంటున్నారు. కార్తీతో ఓకేగాని కమల్‌తోనూ అంతే స్పీడు సినిమా చేయటమే సాధ్యమేనా అన్న డౌట్స్‌ రెయిజ్‌ అవుతున్నాయి.

లాక్ డౌన్‌ తరువాత కమల్ నటిస్తున్న సినిమా ఇదే. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై కమల్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్‌ కావడానికి ముందే టీజర్‌తో సందడి చేసిన చిత్రయూనిట్ త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించేందేకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : 

ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా

Vakeel Saab : పొంగల్ రేస్‌లో పవన్ ఉన్నట్లేనా..?

Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు