భూమిలోపల చిన్న పిల్లల ఏడుపు.. ప్రాణాలతో బయటపడ్డ శిశువు

|

Aug 10, 2020 | 11:54 AM

జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గా జిల్లాలో హృదయవిదాకర ఘటన ఒకటి వెలుగుచూసింది. బతికి ఉండగానే శిశువును పాతిపెట్టిన విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

భూమిలోపల చిన్న పిల్లల ఏడుపు.. ప్రాణాలతో బయటపడ్డ శిశువు
Follow us on

జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గా జిల్లాలో హృదయవిదాకర ఘటన ఒకటి వెలుగుచూసింది. బతికి ఉండగానే శిశువును పాతిపెట్టిన విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. గ్రామంలో రోడ్డుమీద వెళుతున్న ఒక వ్య‌క్తికి సమీప పొదల్లోంచి శిశువు ఏడుపు వినిపించింది. దీంతో పరిసరాల్లో వెతుక్కుంటూ అక్క‌డ‌కు వెళ్లి చూడ‌గా, భూమిలోప‌లి నుంచి చిన్న పిల్లల రోద‌న వినిపిస్తుంద‌ని గ్ర‌హించాడు. వెంట‌నే ఈ విష‌యాన్ని గ్రామ‌స్తుల‌కు తెలియ‌జేశాడు. దీంతో స్థానికులంతా అక్క‌డికి చేరుకుని, భూమిలో పాతిపెట్టిన ఆ శిశువును వెలికితీశారు. ఆ శిశువు ప్రాణాలతో క్షేమంగానే ఉండ‌టంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాలతో బయటపడిని ఈ చిన్నారికి గ్రామానికి చెందిన ప‌లువురు త‌ల్లులు ఆహారం అందించారు. అలాగే, ఆ శిశువును ద‌త్త‌త తీసుకునేందుకు పోటీప‌డ్డారు. జరిగిన విషయాన్ని పోలీసుల‌కు స‌మాచారం అందించారు గ్రామస్తులు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ శిశువును ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆ శిశువు త‌ల్లి‌దండ్రులు ఎవ‌ర‌నే దానిపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.