Manchu Lakshmi: కూతురు విద్యా తో కలిసి బులెట్ బండి సాంగ్‌కు స్టెప్స్ వేసిన మంచువారమ్మాయి..

Manchu Lakshmi: మంచు లక్ష్మి ప్రసన్న నటి, హోస్ట్, నిర్మాత.. మల్టీ టాలెంటెడ్ పర్సన్. సోషల్ మీడియాలో (Social Media) కూడా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ..

Manchu Lakshmi: కూతురు విద్యా తో కలిసి బులెట్ బండి సాంగ్‌కు స్టెప్స్ వేసిన మంచువారమ్మాయి..
Manchu Lakshmi Daughter

Updated on: May 01, 2022 | 7:21 AM

Manchu Lakshmi: మంచు లక్ష్మి ప్రసన్న నటి, హోస్ట్, నిర్మాత.. మల్టీ టాలెంటెడ్ పర్సన్. సోషల్ మీడియాలో (Social Media) కూడా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కు కనువిందు చేస్తుంది. మంచి లక్ష్మికి ఆరేళ్ళ కూతురు విద్యా నిర్వాణ ఉంది. తరచుగా తాను తన కూతురు ఉన్న ఫోటోలు వీడియోలు లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సందడి చేస్తూనే ఉంటుంది. డ్యాన్స్, మేకప్, మేకోవర్, యోగా ఇలా ఇంకా అంశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా మంచు లక్ష్మి తన కూతురు విద్యా తో చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి తన వ్యక్తిగత సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోకి  ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మేం కాస్త ఫన్ చేశాం అంటూ.. క్యాప్షన్ జత చేసింది.

తల్లి కూతురు కలిసి తెలంగాణ ఫేమస్ జానపద సాంగ్ బుల్లెట్ బండి పాటకు స్టెప్స్‌ వేశారు. ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియోలో లక్ష్మి మంచు నైట్ డ్రెస్సులో ఉంది. బులెట్ బండికి జోరుగా వేసిన స్టెప్స్ కు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నీ డ్యాన్స్ కు మేము ఫిదా అని ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. నీవు ఎంత కష్టపడి డ్యాన్స్ చేసినా.. నీకు సినిమాల్లో అవకాశాలు రావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే చాలామంది మాత్రం తల్లీకూతుళ్ల డ్యాన్స్ మాకు నచ్చింది అంటున్నారు. లక్ష్మి ప్రసన్న ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుందని తాము అనుకోలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తే.. నీ డ్యాన్స్ సూపర్ లక్ష్మి అక్కా అంటూ మరొకొందరు కామెంట్స్ చేశారు. లక్ష్మి ముద్దుల తనయ..  జూనియర్ లక్ష్మీ కూడా డాన్స్ బాగా చేసిందని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.

Also Read: HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Indians: దేశ చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయం గురించి ఎంత మందికి తెలుసు.. సర్వేలో వెల్లడైన షాకింగ్ విషయాలు