మంత్రి కొప్పులకు చేదు అనుభవం.. కొండగట్టు బాధితులను ఆదుకోవాలని డిమాండ్

| Edited By:

Sep 13, 2019 | 12:24 PM

కొండగట్టు బస్సు ప్రమాదంపై ఇప్పటివరకు ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రవిశంకర్‌లను అడ్డుకున్నారు . ఈ ఉదయం కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. గత ఏడాది కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులకు తక్షణం సాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంత్రి ఈశ్వర్ గ్రామంలోకి వస్తున్నారని తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డుపై భైటాయించి మంత్రిని […]

మంత్రి కొప్పులకు చేదు అనుభవం.. కొండగట్టు బాధితులను  ఆదుకోవాలని డిమాండ్
Follow us on

కొండగట్టు బస్సు ప్రమాదంపై ఇప్పటివరకు ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రవిశంకర్‌లను అడ్డుకున్నారు . ఈ ఉదయం కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. గత ఏడాది కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులకు తక్షణం సాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంత్రి ఈశ్వర్ గ్రామంలోకి వస్తున్నారని తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డుపై భైటాయించి మంత్రిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రమాదం జరిగి ఇప్పటికి ఏడాది కావస్తున్న బాధితులకు పరిహారం ఇవ్వలేదని ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీంతో తమ ప్రభుత్వం తప్పకుండా బాధితులను ఆదుకుంటుందని, ఇవ్వాల్సిన పూర్తి పరిహారం వచ్చేలా కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

2018 సెప్టెంబర్ 11 న జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు బోల్తా ప్రమాదం జరిగింది. ఆ రోజు మంగళవారం కావడంతో కొండగట్టు హనుమాన్ ఆలయానికి పెద్దఎత్తున భక్తులు ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో జగిత్యాల డిపోకు చందిన ఆర్టీసీ బస్సు కొండగట్టుఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతుండగా బస్సువేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. అయితే అదే సమయలో బ్రేకులు కూడా ఫెయిల్ అయ్యినట్టుగా కూడా వార్తలొచ్చాయి. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 57 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదం. కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ప్రమదదం జరగపే సమయానికి బస్సులో మొత్తం 88 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దారుణమైన ప్రమాదంలో మొత్తం 47 మంది మృతి చెందారు. వీరంతా శనివారం పేట, సింహంపేట గ్రామాలకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే కొండగట్టు ఘాట్ రోడ్డు చివరి మలుపువద్ద ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు స్ధానికులు చెప్పారు. గతంలో కూడా నాలుగు ఘోర ప్రమాదాలుజరిగాయని తెలిపారు.