పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తా.. 14 మందికి గాయాలు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తాపడింది.

పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తా.. 14 మందికి గాయాలు

Updated on: Oct 28, 2020 | 10:33 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొల్లాపూర్‌ మండలం రామాపురం వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో డీసీఎం వాహనంలో 65 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు క్షతగాత్రులను కొల్లాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడు రాజు సురక్షితంగా బయటపడ్డాడు. రేపు ఉదయం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో రాజు వివాహం జరగనుంది. ఈ ఉదంతానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us