జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్

|

Oct 15, 2020 | 10:31 AM

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఫైరయ్యారు.

జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్
Follow us on

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఫైరయ్యారు. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల సందర్శనకు వెళ్లిన నేపథ్యంలో  జీహెచ్ఎంసీ అధికారులు ఆయన పర్యటనకు దూరం పాటించారు. దీనిపై సీరియస్ అయిన కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. కనీసం డీఈ, ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ( సీఎం జగన్‌కు బాబు లేఖ, కంటెంట్ ఇదే )

కాగా హైదరాబాద్‌లో వరదల్లో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కిషన్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెెలుసుకున్నారు.  రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. అత్యవసరమైతేే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని కోరారు. హైదరాబాద్‌లో గత 40 ఏళ్లలో ఇలాంటి ఘోర పరిస్థితిని చూడలేదని ఆయన పేర్కొన్నారు.