ఆ మృగాళ్లకు ఉరిశిక్ష వేస్తారా..? లేదా..? విద్యార్థి ఆత్మహత్యాయత్నం

| Edited By:

Dec 04, 2019 | 3:24 PM

దిశ హత్యా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి.. ఆ నలుగురికి తక్షణమే ఉరి తీయాలని మూడు అంతస్తుల భవనం ఎక్కి హల్‌చల్ చేశాడు. ఒకవేళ వాళ్ళని ఉరి తీయకపోతే.. పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అత్యాచారం, పైగా సజీవదహనం చేసిన వారిని ఇంకా కోర్టులు, కేసులు అంటూ తిప్పడమేంటని.. ఆ […]

ఆ మృగాళ్లకు ఉరిశిక్ష వేస్తారా..? లేదా..? విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Follow us on

దిశ హత్యా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి.. ఆ నలుగురికి తక్షణమే ఉరి తీయాలని మూడు అంతస్తుల భవనం ఎక్కి హల్‌చల్ చేశాడు. ఒకవేళ వాళ్ళని ఉరి తీయకపోతే.. పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

అత్యాచారం, పైగా సజీవదహనం చేసిన వారిని ఇంకా కోర్టులు, కేసులు అంటూ తిప్పడమేంటని.. ఆ నలుగురిని తక్షణమే ఉరి తీయాల్సిందనేనని రోహిత్ పట్టుబట్టాడు. తాను పక్కాగా నిర్ణయం తీసుకునే బిల్డింగ్ పైకి ఎక్కానని.. ఈ సొసైటీలో బ్రతకడం తనకు ఇష్టం లేదని.. ‘ఐ హేట్ ఇండియా’ అంటూ నినాదాలు చేశాడు.

ఇకపోతే అక్కడ ఉన్న స్థానికులు, పోలీసులు రోహిత్‌ను దిగమని బ్రతిమాలారు. కానీ ఎవరి మాట వినకపోవడం అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఎలాగోలా చివరికి రోహిత్‌ను పోలీసులు బిల్డింగ్ పై నుంచి దింపగలిగారు. కాగా, దిశ అమానుష ఘటనపై యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను తమకు అప్పగించాలని.. తామే చంపేస్తామని అంటున్నారు.