కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !

|

Sep 04, 2020 | 11:22 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల రైతులకు ఒక్క‌సారిగా ఊహించ‌ని క‌ష్టం వ‌చ్చింది. కేజీ చేప‌ల‌ను రూ.10కే ఇస్తామ‌న్నా, కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు.

కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల రైతులకు ఒక్క‌సారిగా ఊహించ‌ని క‌ష్టం వ‌చ్చింది. కేజీ చేప‌ల‌ను రూ.10కే ఇస్తామ‌న్నా, కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో ఈ ప‌రిణామం చోటుచేసుకుంది. దీంతో చేప‌ల రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. అయితే ఇంత తక్కువ ధరకు విక్రయించడానికి కూడా ఓ రీజ‌న్ ఉంది. ఈ చేపలన్నీ వాటంత‌ట అవే నీటిపై తేలడంతో వాటిని ఎవరూ కొనుగోలు చేయ‌డం లేదు. వాటిలో కొన్ని మ‌ర‌ణించినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు.

ఆకువీడు ప్రాంతంలోని చెరువుల్లో చేపలు పైకి తేలడానికి వాతావరణంలో మార్పు కారణంగా చెబుతున్నారు. ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో ఇలా జ‌రిగింద‌ని రైతులు వివ‌రించారు. దీంతో 40 టన్నుల చేపలను మార్కెట్‌కు తీసుకెళ్లారు. కానీ జ‌నాల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో కొనేందుకు ఎవ‌రూ ఇంట్ర‌స్ట్ చూప‌లేదు. దీంతో చేపల చెరువులు వేసిన రైతులకు తీవ్ర న‌ష్టం వాటిల్లింది.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​