కేరళలో ఒక్కరోజే 10 వేలకు పైగా కొత్త కరోనా కేసులు

|

Oct 07, 2020 | 9:27 PM

కేరళలో కరోనా వైరస్‌ ప్రకోపానికి విలవిలలాడుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

కేరళలో ఒక్కరోజే 10 వేలకు పైగా కొత్త కరోనా కేసులు
Follow us on

కేరళలో కరోనా వైరస్‌ ప్రకోపానికి విలవిలలాడుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయని కేరళ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 10,606 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజులో కరోనా బారిన పడి 22 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,53,405కు చేరింది. ఇక ఇప్పటివరకు మరణాల సంఖ్య 906కు పెరిగింది. గత 24 గంటల్లో 6,161 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 1,60,253 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వైరస్ బారినపడి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 92,161 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో కరోనా మళ్లీ విజృభిస్తుండటంతో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న తిరువనంతపురం, కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాల్లో మరోసారి లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు అధికారులు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉంటే సంబంధిత చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది.