Military Helicopter Crash: కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. డిఫెన్స్‌ చీఫ్‌తో సహా తొమ్మిది మంది సైనికులు మృతి!

కెన్యాలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లా (61)తో పాటు తొమ్మిది మంది మిలిటరీ అధికారులు దుర్మరణం చెందారు. లేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మిలిటరీ హెలికాఫ్టర్‌ కుప్పకూలిందని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. ఈ సంఘటన రాజధాని నైరోబీ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో గురువారం చోటు..

Military Helicopter Crash: కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. డిఫెన్స్‌ చీఫ్‌తో సహా తొమ్మిది మంది సైనికులు మృతి!
Kenya Military Helicopter Crash
Follow us

|

Updated on: Apr 19, 2024 | 8:07 AM

నైరోబీ, ఏప్రిల్‌ 19: కెన్యాలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లా (61)తో పాటు తొమ్మిది మంది మిలిటరీ అధికారులు దుర్మరణం చెందారు. లేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మిలిటరీ హెలికాఫ్టర్‌ కుప్పకూలిందని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. ఈ సంఘటన రాజధాని నైరోబీ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. కెన్యా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కెన్యా వాయువ్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, తీవ్ర విచారంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 9 మంది మరణించారు.

వాయువ్య కెన్యాలో స్థానిక పశువుల రస్ట్లింగ్‌ను ఎదుర్కోవడనాకి మోహరించిన సైనిక దళాలను సందర్శించిన అనంతరం హెలికాఫ్టర్‌ వెస్ట్‌పోకోట్‌ కౌంటీలోని చెప్టులెల్‌ బాయ్స్‌ సెకండరీ స్కూల్‌ నుంచి తిరిగి బయల్దేరిన కొద్ది నిమిషాలకే కులప్పకూలింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ బృందాన్ని పంపామని అధ్యక్షుడు రూటో తెలిపారు.

కెన్యా దేశం అత్యంత పరాక్రమవంతులైన వారిలో ఒకరైన జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లాను కొల్పోయిందని, ఆయన మరణం తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. ఒగొల్లా గతంలో కెన్యా వైమానిక దళాధిపతిగా విధులు నిర్వహించారు. డిప్యూటి మిలిటరీ చీఫ్‌గా మాధ్యతలు చేపట్టడానికి ముందు మిలిటరీకి అధిపతిగా పనిచేశారు. ఆయన గత ఏడాది డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రొఫైల్ ప్రకారం.. ఒగోల్లా 1984లో కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరారు. అక్కడ ఆయన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా, కెన్యా ఎయిర్ ఫోర్స్ (KAF)లో ఇన్‌స్ట్రక్టర్‌ పైలట్‌గా శిక్షణ పొందారు. 40 ఏళ్లుగా ఆయన మిలిటరీలో సేవలు అందిస్తున్నారు. కాగా జూన్ 2021లో రాజధాని నైరోబీ ఓ హెలికాఫ్టర్‌ కూలిపోవడంతో కనీసం 10 మంది సైనికులు మరణించారు. సరిగ్గా ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయింది. కాగా గత 12 నెలల కాలంలో దాదాపు 5 కెన్యా మిలిటరీ హెలికాప్టర్లు కూలిపోయినట్లు అక్కడి స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం
జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్య చెప్పిన ఈ 5 విషయాలు మీ కోసం
పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!
పోటీలో లేని పార్టీ.. అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించిన ఈసీ!
ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..
ఎలక్ట్రిక్ బైక్‌లలో రారాజు ఇది.. 150 కి.మీ. రేంజ్..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..