నామినేషన్ దాఖలుకు 6 గంటలు వెయిటింగ్.. ‘సహనశీలి’ కేజ్రీవాల్ ..

| Edited By: Pardhasaradhi Peri

Jan 21, 2020 | 7:14 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేసేందుకు 6 గంటల పాటు నిరీక్షించవలసివచ్చింది. నామినేషన్లు వేసేందుకు ఇది చివరిరోజు కావడంతో జామ్ నగర్ హౌస్ లోని ఎన్నికల కార్యాలయం భారీ సంఖ్యలో వఛ్చిన అభ్యర్థులతో కిటకిటలాడింది. ఇవాళ 100 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులు తీరారు. కేజ్రీవాల్ ను ఎలాగైనా ఆపేందుకు బీజేపీ 40 మందికి పైగా క్యాండిడేట్స్ ను పంపిందని ‘ఆప్’ ఆరోపించింది. కేజ్రీవాల్ ముందు ఆ పార్టీ […]

నామినేషన్ దాఖలుకు 6 గంటలు వెయిటింగ్.. సహనశీలి కేజ్రీవాల్ ..
Follow us on

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేసేందుకు 6 గంటల పాటు నిరీక్షించవలసివచ్చింది. నామినేషన్లు వేసేందుకు ఇది చివరిరోజు కావడంతో జామ్ నగర్ హౌస్ లోని ఎన్నికల కార్యాలయం భారీ సంఖ్యలో వఛ్చిన అభ్యర్థులతో కిటకిటలాడింది. ఇవాళ 100 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులు తీరారు. కేజ్రీవాల్ ను ఎలాగైనా ఆపేందుకు బీజేపీ 40 మందికి పైగా క్యాండిడేట్స్ ను పంపిందని ‘ఆప్’ ఆరోపించింది.

కేజ్రీవాల్ ముందు ఆ పార్టీ 45 మందిని నిలబెట్టిందని, పైగా ఎన్నికల కమిషన్ కూడా ప్రతి అభ్యర్థికీ కావాలనే అరగంట నుంచి గంట సేపు సమయం కేటాయించిందని డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా పేర్కొన్నారు. కాగా-కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. తన టోకెన్ నెంబరు 45 అని, నామినేషన్లు వేసేందుకు ఎంతోమంది వేచి ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా చాలామంది పార్టిసిపేట్ చేస్తునందుకు సంతోషంగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఎలాగైతేనేం ? మధ్యాహ్నం 3 గంటల్లోగా ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.