Big Breaking: తెలంగాణలో అన్ని షాపులు, సేవలకు పర్మిషన్..!

తెలంగాణలోని మున్సిపాలిటీల్లో్ అన్ని షాపులు, సేవలకు పర్మిషన్‌ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ యథావిథిగా కొనసాగనున్నట్లు ఆయన ప్రకటించారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ తప్ప మిగతా జిల్లాల్లో యథావిథిగా పనులు జరగనున్నాయని, హైదరాబాద్‌పై త్వరలో ప్రకటన వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. ఇక నగరంలో సిటీ బస్సులకు పర్మిషన్ లేదని.. ఇతర రాష్ట్రాలకు బస్‌ సర్వీసులు లేవని ఆయన స్పష్టం చేశారు. […]

Big Breaking: తెలంగాణలో అన్ని షాపులు, సేవలకు పర్మిషన్..!

Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 8:29 PM

తెలంగాణలోని మున్సిపాలిటీల్లో్ అన్ని షాపులు, సేవలకు పర్మిషన్‌ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ యథావిథిగా కొనసాగనున్నట్లు ఆయన ప్రకటించారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ తప్ప మిగతా జిల్లాల్లో యథావిథిగా పనులు జరగనున్నాయని, హైదరాబాద్‌పై త్వరలో ప్రకటన వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. ఇక నగరంలో సిటీ బస్సులకు పర్మిషన్ లేదని.. ఇతర రాష్ట్రాలకు బస్‌ సర్వీసులు లేవని ఆయన స్పష్టం చేశారు. టాక్సీలు, కార్లలో 1+3 చొప్పున.. అలాగే ఆటోలో 1+2 చొప్పున అనుమతి ఇవ్వబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక కంటెండ్ ఏరియా తప్ప అన్ని ఏరియాల్లో సెలున్లు ఓపెన్ చేసుకోవచ్చని కేసీఆర్ సూచించారు. ఈ కామర్స్ లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలకు లోబడి తమ కార్యకలపాలను కొనసాగించవచ్చునని ఆయన అన్నారు. అలాగే అన్ని రకాల ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, సభలు, ర్యాలీలు, సమావేశాలు, విద్య సంస్థలు బంద్ చేయనున్నట్లు కేసీఆర్ వివరించారు.

Read This Story Also: కరోనా పరీక్షలు ఎవరెవరికి చేయాలంటే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!